Thursday, January 12, 2023

Ganapathi Bappa Moriya Song lyrics - Iddarammayilatho - Allu Arjun Song

Everybody gonna gonna sing
Just like the music plays
Hey Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....

Vakrathunda maha kaaya.... Ganapathi bappa moriyaaa....
Suryakoti sama prabha.... Ganapathi bappa moriyaaa....
Nirvighnam kurume deva... Ganapathi bappa moriyaaa....
Sarvakaryeshu sarvadaaa... Ganapathi bappa moriyaaa....

Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa.... ohoohohhhh
Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Gana gana gana Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....


Chalo chalo.. nachhe daarilo
Neeke nuvvu cheppey helloooo
Puvvo mullo nadiche daarilo
Neekeduravvachu bayapettachu mundadugesthe gelicheyachu

Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Gana gana gana Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....

Hey nuvvelle daarilo kondosthe.. woo woo wahaa aa woo woo wahaa
Arey trecking anukoni ekkesuko.. woo woo wahaa aa woo woo wahaa
Hey nuvvelle rootulo loyosthe Adi bangi jump ke vaadesuko
Hey samudramosthe nee throvalo.. woo woo wahaa aa woo woo wahaa
Adi swimming kosam use chesuko.. woo woo wahaa aa woo woo wahaa
Ae toofan kani vachhindo aa speed antha neelo nimpesuko

We are from INDIA.. Vijayam mania..
Arey janda ooncha rahe hamara.. sayyo sayya

Are you ready for indian dance...

Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa.... ohoohhhoohoh
Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....
Gana gana gana Ganapathi bappa moriyaaa.... Ganapathi bappa moriyaaa....

Monday, October 8, 2018

Rama Rama Rama Rama Song Lyrics - Srimanthudu - 2015

Movie    :  Srimanthudu
Lyrics    :  Ramajogayya Sastry
Music    :  Devi Sri Prasad
Singers  :  Sooraj Santosh, M L R Karthikeyan, Ranina Reddy

సూర్యవంశ తేజమున్న
సుందరాంగుడు పున్నమీసెంద్రుడు
మారాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు
జనమమెత్తిన మహానుభావుడు... వాడే శ్రీరాముడు

పల్లవి : -
రాములోడు వచ్చినాడురో దన్ తస్సదియ్య
శివధనస్సు ఎత్తినాడురో
నారి పట్టి లాగినాడురో దన్ తస్సదియ్య
నింగికెక్కు పెట్టినాడురో
ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు
భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు
విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 

మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ
చరణం - 1:-

రాజ్యమంటె లెక్కలేదురో దన్ తస్సదియ్య
అడవిబాట పట్టినాడురో
పువ్వులాంటి సక్కనోడురో దన్ తస్సదియ్య
సౌక్యమంత పక్కనెట్టెరో
బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి
పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి
తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ

రామసక్కనోడు మా రామసెంద్రుడంట
ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట
అందగాళ్లకే గొప్ప అందగాడట
నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా 

చరణం - 2:-

జీవుడల్లే పుట్టినాడురో దన్ తస్సదియ్య
దేవుడల్లె ఎదిగినాడురో
నేలబారు నడిచినాడురో దన్ తస్సదియ్య
పూల పూజలందినాడురో
పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 



Ghal Ghal Song Lyrics - Nuvvosthanante Nenoddantana - 2005

Movie:- నువ్వోస్తానంటే నేనోద్దంటానా
Singer:- S. P. బాలసుబ్రమణ్యం
Lyrics:- సిరివెన్నెల సీతారామశాస్త్రి
Music:- దేవి శ్రీ ప్రసాద్

పల్లవి:-

ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
చరణం-1:-
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
చరణం - 2:-
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

Chal Chalo Chalo Song Lyrics - Allu Arjun Songs - S/O Satyamurthy -2015

Movie   :  S/O Satyamurthy
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Devi Sri Prasad
Singer  :  Rahul Dixit

రాజ్యం గెలిసినోడు, రాజవుతాడు..
రాజ్యం ఇడిసినోడే, రామసంద్రుడు ...
యుద్ధం గెలిసేటోడు, వీరుడు, శూరుడు,
యుద్ధం ఇడిసేటోడే, దేవుడు


పల్లవి :-

ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...

చరణం - 1:-

తీపితో పాటుగా ఓ.. కొత్త చేదు
అందించడం జిందగీకీ అలవాటే...
కష్టమే రాదనే గారెంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకొ హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...

చరణం - 2:-

కన్నీలెందుకు ఉప్పగుంటాయ్..
తీయగుంటె కడదాకా వదలవు గనక...
కష్టాలెందుకు బరువుగుంటాయ్..
తేలికైతే బ్రతుకంత మోస్తూ దించవ్ గనక..
ఎదురే లేని నీకు కాక ...
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దామంటు నీ తడాక
వచ్చింది ఈ బండి నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డ వాడే కష్టపడ్డ వాడే
పైకి లేచే ప్రతోడు ఒక్కడైన కానరాడే
జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు
ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో ...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...

చరణం - 3:-

మడతే నలగని షర్ట్ లాగా...
అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు
గీతే తగలని కాగితంలా...
ఉట్టి చెదలు పట్టిపోతే
 ఫలితం లేనే లేదు...
పుడుతూనే గుక్క పెట్టినాకా...
కష్టమన్న మాటేమి కొత్తేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోకా...
ఆకాశం ఎత్తుల్లో 
ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్సు కాదు మైనస్సు కాదు
అనుభవాలే ఏదైనా...
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ
సాగిపోరా నీదైనా గెలుపు దారిలోనా..
ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో ...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...


Amma Ani Kothaga song lyrics- Life is Beautiful- 2012

Movie    :  Life Is Beautiful
Lyrics    :  Vanamali
Music    :  Mickey J Meyer
Singers  :  Shashikiran, Shravan
(తెరవెనుకసంగీతం:- సరిగమపదనిస సనిదపమగరిస)
పల్లవి :-
అమ్మా అని కొత్తగా..
మళ్ళీ పిలవాలనీ



తుళ్ళే పసి ప్రాయమే.. 
మళ్ళీ మొదలవ్వనీ 
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

చరణం - 1:-

నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై
ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
చరణం - 3:-చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా 
చరణం-4:-నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా 

Merupai Sagara Song - Style Movie Song - 2001

పల్లవి:-
మెరుపై సాగరా 
ఆ గెలుపే నీదిరా 
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
నిప్పులు చిందినా
ఏ పిడుగులు ఆపినా 
వెనకడుగే వేయక ముందుకు సాగరా
నలుదిక్కులు నవ్వుతు ఉన్నా
నలుపెక్కని సూర్యుడు నువ్వై
ఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి ని యుక్తి గ చూపెయ్
నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
చరణం - 1:-
అమ్మ మాట కోసం నువ్వు ఆయుధం గా మారి కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా
ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు నిండుగా మురిసేను రా మీ అమ్మ ఎక్కడున్నా
చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం
నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం
లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
చరణం - 2:-
కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి
పందెమేది ఐనా నీ పట్టుదలను చూసి ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి
అందరికి చేతుల్లో ఉంటుంది గీతా నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత
నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత
లేరా చిందెయ్ రా విజయం నీదేరా
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

Raa Ramani song lyrics - Avunu Vallidaru istapaddaru - 2002

పల్లవి :
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ

చరణం : 1
పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే
జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే
అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే
అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే
నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా
ఇదేగా ప్రేమపండుగ...
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ

చరణం : 2
ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే
సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే
ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే
నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే
సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా
సుఖిస్తాను నీ పంచన...
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో...