Monday, October 8, 2018

Rama Rama Rama Rama Song Lyrics - Srimanthudu - 2015

Movie    :  Srimanthudu
Lyrics    :  Ramajogayya Sastry
Music    :  Devi Sri Prasad
Singers  :  Sooraj Santosh, M L R Karthikeyan, Ranina Reddy

సూర్యవంశ తేజమున్న
సుందరాంగుడు పున్నమీసెంద్రుడు
మారాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు
జనమమెత్తిన మహానుభావుడు... వాడే శ్రీరాముడు

పల్లవి : -
రాములోడు వచ్చినాడురో దన్ తస్సదియ్య
శివధనస్సు ఎత్తినాడురో
నారి పట్టి లాగినాడురో దన్ తస్సదియ్య
నింగికెక్కు పెట్టినాడురో
ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు
భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు
విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 

మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ
చరణం - 1:-

రాజ్యమంటె లెక్కలేదురో దన్ తస్సదియ్య
అడవిబాట పట్టినాడురో
పువ్వులాంటి సక్కనోడురో దన్ తస్సదియ్య
సౌక్యమంత పక్కనెట్టెరో
బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి
పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి
తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ

రామసక్కనోడు మా రామసెంద్రుడంట
ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట
అందగాళ్లకే గొప్ప అందగాడట
నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా 

చరణం - 2:-

జీవుడల్లే పుట్టినాడురో దన్ తస్సదియ్య
దేవుడల్లె ఎదిగినాడురో
నేలబారు నడిచినాడురో దన్ తస్సదియ్య
పూల పూజలందినాడురో
పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ 



Ghal Ghal Song Lyrics - Nuvvosthanante Nenoddantana - 2005

Movie:- నువ్వోస్తానంటే నేనోద్దంటానా
Singer:- S. P. బాలసుబ్రమణ్యం
Lyrics:- సిరివెన్నెల సీతారామశాస్త్రి
Music:- దేవి శ్రీ ప్రసాద్

పల్లవి:-

ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
చరణం-1:-
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
చరణం - 2:-
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

Chal Chalo Chalo Song Lyrics - Allu Arjun Songs - S/O Satyamurthy -2015

Movie   :  S/O Satyamurthy
Lyrics   :  Ramajogayya Sastry
Music   :  Devi Sri Prasad
Singer  :  Rahul Dixit

రాజ్యం గెలిసినోడు, రాజవుతాడు..
రాజ్యం ఇడిసినోడే, రామసంద్రుడు ...
యుద్ధం గెలిసేటోడు, వీరుడు, శూరుడు,
యుద్ధం ఇడిసేటోడే, దేవుడు


పల్లవి :-

ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...

చరణం - 1:-

తీపితో పాటుగా ఓ.. కొత్త చేదు
అందించడం జిందగీకీ అలవాటే...
కష్టమే రాదనే గారెంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకొ హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...

చరణం - 2:-

కన్నీలెందుకు ఉప్పగుంటాయ్..
తీయగుంటె కడదాకా వదలవు గనక...
కష్టాలెందుకు బరువుగుంటాయ్..
తేలికైతే బ్రతుకంత మోస్తూ దించవ్ గనక..
ఎదురే లేని నీకు కాక ...
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దామంటు నీ తడాక
వచ్చింది ఈ బండి నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డ వాడే కష్టపడ్డ వాడే
పైకి లేచే ప్రతోడు ఒక్కడైన కానరాడే
జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు
ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో ...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...

చరణం - 3:-

మడతే నలగని షర్ట్ లాగా...
అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు
గీతే తగలని కాగితంలా...
ఉట్టి చెదలు పట్టిపోతే
 ఫలితం లేనే లేదు...
పుడుతూనే గుక్క పెట్టినాకా...
కష్టమన్న మాటేమి కొత్తేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోకా...
ఆకాశం ఎత్తుల్లో 
ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్సు కాదు మైనస్సు కాదు
అనుభవాలే ఏదైనా...
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ
సాగిపోరా నీదైనా గెలుపు దారిలోనా..
ఛల్ ఛలో ఛలో...
లైఫ్ సే మిలో..
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో ...
ఛల్ ఛలో ఛలో...
చలించు దారిలో...
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో...


Amma Ani Kothaga song lyrics- Life is Beautiful- 2012

Movie    :  Life Is Beautiful
Lyrics    :  Vanamali
Music    :  Mickey J Meyer
Singers  :  Shashikiran, Shravan
(తెరవెనుకసంగీతం:- సరిగమపదనిస సనిదపమగరిస)
పల్లవి :-
అమ్మా అని కొత్తగా..
మళ్ళీ పిలవాలనీ



తుళ్ళే పసి ప్రాయమే.. 
మళ్ళీ మొదలవ్వనీ 
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

చరణం - 1:-

నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై
ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
చరణం - 3:-చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా 
చరణం-4:-నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా 

Merupai Sagara Song - Style Movie Song - 2001

పల్లవి:-
మెరుపై సాగరా 
ఆ గెలుపే నీదిరా 
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
నిప్పులు చిందినా
ఏ పిడుగులు ఆపినా 
వెనకడుగే వేయక ముందుకు సాగరా
నలుదిక్కులు నవ్వుతు ఉన్నా
నలుపెక్కని సూర్యుడు నువ్వై
ఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి ని యుక్తి గ చూపెయ్
నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
చరణం - 1:-
అమ్మ మాట కోసం నువ్వు ఆయుధం గా మారి కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా
ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు నిండుగా మురిసేను రా మీ అమ్మ ఎక్కడున్నా
చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం
నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం
లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
చరణం - 2:-
కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి
పందెమేది ఐనా నీ పట్టుదలను చూసి ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి
అందరికి చేతుల్లో ఉంటుంది గీతా నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత
నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత
లేరా చిందెయ్ రా విజయం నీదేరా
మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

Raa Ramani song lyrics - Avunu Vallidaru istapaddaru - 2002

పల్లవి :
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ

చరణం : 1
పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే
జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే
అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే
అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే
నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా
ఇదేగా ప్రేమపండుగ...
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ

చరణం : 2
ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే
సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే
ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే
నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే
సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా
సుఖిస్తాను నీ పంచన...
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో...

Manasa Vacha Song Lyrics - Godavari Song - 2006

పల్లవి :
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చరణం - 1:
చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చరణం - 2:
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా..
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

Nuvve Na Swasa - Shreya Goshal Songs - Okariki Okaru - 2003

Movie Name : ఒకరికి ఒకరు  (2003)
Singer : శ్రేయ గోశల్
Lyrics : చంద్రబోస్ 

Music : ఎం ఎం కీరవాణి
పల్లవి :
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
చరణం - 1:
పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు
తారలలో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బులోన చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా...
నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా
నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
చరణం - 2:
సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని
ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా...ఓ ప్రియతమా...

Mama Chandamama - Sambarala Rambabu Song - 1970

పల్లవి:
    మామా... చందమామా
    వినరావా...నా కథ
    మామా చందమామా
    వినరావా నా కథ
    వింటే మనసు ఉంటే
    కలిసేవూ నా జత
    మామా...చందమామా

చరణం - 1:
    నీ రూపము ఒక దీపము
    గతిలేని పేదకు... || 2 ||
    నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు
    నువు లేక నువు రాక
    విడలేవు కలువలు...
    జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు....

చరణం - 2:
    మింటిపైన నీవు ఓంటిగాడివై
    అందరికీ వెన్నెల పంచ
    రేయంత తిరగాలి

    ఇంటిలోన నేను ఒంటిగాడినై
    అందరికీ సేవలు చేయ
    రేయి పవలు తిరగాలి

    లేరు మనకు బంధువులు
    లేరు తల్లిదండ్రులు
    మనను చూసి అయ్యోపాపం
    అనేవారు ఎవ్వరు
    అనేవారు ఎవ్వరు...

    మామా చందమామా
    వినరావా నా కథ
    వింటే మనసు ఉంటే
    కలిసేవూ నా జత
    మామా... చందమామా

Meerajalagalada Song lyrics - Srikrishna Tulabharam - 1966

Movie : శ్రీ కృష్ణ తులాభారం (1966)
Music : Ghantasala

పల్లవి :
మీరజాలగలడా....
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
చరణం - 1:
నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం - 2:
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం - 3:
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..ఆ..ఆ..
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా...

Eduta Nilichindi Choodu - Vaana song - 2008

Movie    :  Vaana
Lyrics    :  Sirivennela
Music    :  Kamalakar
Singer   :  Karthik


పల్లవి :

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు
చరణం - 1 :
నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు
చరణం - 2:
నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు




Vedam anuvanuvuna nadam - Sagara Sangamam - 1983

గా. మా..  నీ..  గమగస, మగస, గస...  నీ సా... 
నిదమగ..  దమగ, మగ, సరీ, సానీ, గమగా రీ గమాగ మదామ దనిద నిదాని రీ
పల్లవి :
వేదం అనువనువున నాదం || 2 ||
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసా నంది రాగాలై
వేదం వేదం అనువనువున నాదం
చరణం -1:
సాగర సంగమమె ఒక యోగం
నిరిసనిదమగ గదమగరిసని నిరిసనిదమగ మదనిసరీసగారిమగదమగనిదనిసానిదనిమగదమరిగస
సాగర సంగమమె ఒక యోగం సారజలదులె క్షీరములాయె
ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిర నర్తనమాయె
పదములు తామె పెదవులు కాగ
పదములు తామె పెదవులు కాగ
గుండియలె అందియలై మ్రోగ
వేదం అనువనువున నాదం

మాతృ దేవోభవ పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ
అతిధి దేవోభవ అతిధి దేవోభవ


యెదురాయె గురువైన దైవం యెదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణైపోయె జీవం
నటరాజ పాదాన తల వాల్చనా నయనాభిశేకాన తరియించనా
నటరాజ పాదాన తల వాల్చనా నయనాభిశేకాన తరియించనా
సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గానా

|| వేదం అనువనువున ||

జయంతి తె సుకృతినొ రససిద్ధ కవీస్వరా నాస్థితేషాం 

యషః కాయె జరామరణజం భయం నాస్థి 
జరామరణజం భయం నాస్థి జరామరణజం భయం

వేదం అనువనువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంస నంది రాగాలై
వేదం వేదం వేదం వేదం వేదం

Sangeetha Sahithya Samalankruthe - Swati Kiranam Song - 1992


Singer: S. P. బాలసుబ్రమణ్యం
Music: K.V. మహదేవన్
Lyrics: Dr . సి. నారాయణ రెడ్డి 

స.. రిగమపదనిస...  నిదపమగరిసరి .... 
ఆఆ ... ఆ ఆ ... ఆ ఆ  ...
పల్లవి :
సంగీత, సాహిత్య, సమలంకృతే
స్వర రాగ, పదయోగ, సమభూషితే ..  || 2 ||
హే భారతీ , మనసా, స్మరామి...|| 2 || 
శ్రీ భారతీ, శిరసా, నమామి || 2 || || సంగీత || 
చరణం - 1:
వేద వేదాంత వనవాసిని, పూర్ణ శశిహాసినీ ,
నాద నాదాంత పరివేశిని, ఆత్మ సంభాషిణి || వేద ||
వ్యాస-వాల్మీకి వాగ్దాయిని || 2 ||
జ్ఞానవల్లి సవుల్లాసిని || సంగీత || 
చరణం - 2:
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి || 2 ||
భవ్య భలకారిణి,
నిత్య చైతన్య నిజ రూపిణి, సత్య సందీపిణి, || బ్రహ్మ రసనాగ్ర ||
సకల సుకళాసమున్వేషిణి || 2 ||
సర్వ రస భావ సందీపిణి
|| సంగీత ||
కోరస్: స రిగమా రి గమపా మపద నిదస రిసగ రిస .. స ..  స .. 

Saturday, October 6, 2018

Ranga Ranga Rangasthalana Song Lyrics - Ram Charan Songs - Rangasthalam (2018)

Movie : రంగస్థలం (2018)
Lyrics : చంద్రబోస్ 
Music : దేవి శ్రీ ప్రసాద్ 
Singer : రాహుల్ సిప్లిగుంజ్ 

పల్లవి :
రంగా రంగా, రంగస్థలానా || 3 || 
(వినపడేట్టు కాదురా కనపడేట్టు కొట్టండెహె )
రంగా రంగా, రంగస్థలానా, 
రంగు పూసుకోకున్నా, వేసమేసుకోకున్నా,
ఆట బొమ్మలం అంట, మనమంతా తోలు బొమ్మలం అంట || 2 ||

రంగా రంగా, రంగస్థలానా, 
ఆట మొదలెట్టాక, మధ్యలోనే ఆపలేని || ఆట బొమ్మలం - 2 || 
కనపడని చెయ్యేదో ఆడిస్తునా, ఆట బొమ్మలం అంట 
వినపడని పాటకి చిందాడేస్తున్నా, తోలు బొమ్మలం అంట,

డుంగురు డుంగురు డుంగురు, డుముకో, డుంగురు డుంగురు డుంగురు 
|| 2 || (హొయ్యా)

చరణం - 1:
గంగంటే, శివుడి గారి పెళ్ళాం అంట,
గాలంటే, హనుమంతుడి నాన్న గారట,
గాలి పీల్చడానికైనా, గొంతు తడపడానికైన,
వాళ్ళు కనికరించాలంట,
వేణువంటే, కిట్టమూర్తి వాద్యమంట, శూలమంటే కాళికమ్మ ఆయుధం అంట,
పాట పాడడానికైనా, పోటు  పొడవడానికైనా,
వాళ్లు ఆనతిస్తేనే, అన్నీ, జరిగేనంటా ... 
|| రంగా రంగా || || డుంగురు ||

చరణం - 2:
పది తలలు ఉన్నోడు, రావణుడంట,
ఒక్క తలపు కూడా, చెడు లేక, రాముడికంట,
రామ - రావణుల బెట్టి,  రామాయణం ఆట గట్టి,
మంచి - చెడుల, మధ్య, మనని, పెట్టారంటా,
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట,
దయ లేని వాడు యమధర్మరాజట,
వీడి బాట నడవకుంటే, వాడి వేటు తప్పదంటు,
ఈ బతుకును నాటకంగా, ఆడిస్తున్నారంట 
రంగా రంగా  రంగస్థలానా, 
ఆడడానికంటే ముందు, సాధనంటూ చెయ్యలేని
|| ఆట బొమ్మలం అంట - 2 || || డుంగురు  - 2 ||

Pedave Palikina Matallone Song Lyrics - Mahesh Babu Songs - Nani (2004)

Movie    :  నాని (2004)
Lyrics    :  చంద్రబోస్
Music    :  ఏ ఆర్ రెహెమాన్ 

Singers  :  ఉన్ని కృష్ణన్,  సాధన సర్గం

పల్లవి :
పెదవే పలికిన మాటల్లోనే, తియ్యని మాటే, అమ్మా ... 
కదిలే దేవత అమ్మా ...  కంటికి వెలుగమ్మా ...  || 2 ||
తనలో, మమతే కలిపి, పెడుతుంది ముద్దగా ...
తన లాలి పాటలోని, సరిగమ, పంచుతుంది, ప్రేమ మధురిమ,
|| పెదవే పలికిన ||


చరణం - 1:
మనలోని ప్రాణం అమ్మ...  మనదైన రూపం అమ్మ ...
ఎనలేని, జాలి గుణమే, అమ్మా ...
నడిపించే దీపం అమ్మ ...  కరుణించే కోపం అమ్మ ...

వరమిచ్చే తీపి శాపం అమ్మా ...
నా ఆలి, ఆమ్మగా, అవుతుండగా ...
జో లాలి పాడనా, కమ్మగ, కమ్మగా ...
|| పెదవే పలికిన || 


చరణం - 2:
పొత్తిల్లో ఎదిగే బాబు, నా ఒళ్లో ఒదిగే బాబు ...
ఇరువురికి, నేను అమ్మవనా ...
నా కొంగు పట్టే వాడు, నా కడుపున పుట్టే వాడు ...
ఇద్దరికి, ప్రేమ అందించనా ...
నా చిన్ని నాన్నని, వాడి నాన్నని,
నూరేళ్లు సాకనా, చల్లగ చల్లగా ... 


ఎదిగీ ఎదగని ఓ పసి కూనా, ముద్దుల కన్నా, జో జో...
బంగరు తండ్రి, జో జో, బజ్జో లాలి, జో ... 


పలికే పదమే వినక, కనులారా నిదురపో ...
కలలోకి నేను చేరి, తదుపరి పంచుతాను, ప్రేమ మాధురి ... 

|| ఎదిగీ ఎదగని ||
బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో

Thakadimithom song lyrics - Allu Arjun Songs - Arya - 2004

Movie    : ఆర్య 
Lyrics    :  సురేంద్ర కృష్ణ 
Music    :  దేవి శ్రీ ప్రసాద్ 
Singer   :  టిప్పు 

పల్లవి :
తకదిమి తోం, తకదిమి తోం, తరికిట తరికిట తకదిమి తోం,
చిందులు వేసే వయసుకి, తకదిమి తోం,
తకదిమి తోం, తకదిమి తోం, సరిగమ పదమని తకదిమి తోం,
ఉరకలు వేసే మనసుకు, తకదిమి తోం. 



చరణం - 1:
కష్టం నష్టం యెదురైనా, నచ్చినదె చేసేద్దాం,
అలవాటైనా చేదైనా, తకదిమి తోం,
తప్పో వొప్పో చేసేద్దాం, తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా, తకదిమి తోం,
కృషి వుంటే, నీ వెంటేరా, ఈ లోకం ...
గాయేంగె...  జోష్ కేలియే ...  జీయేంగె ... ప్యార్ కేలియే ... 

|| తకదిమి తోం ||
చరణం - 2:
చిరునవ్వుతో ...  అటు చీకటిని, ఇటు ఓటమిని,

తరిమెయ్యరా ఆ ఓర్పుకి తకదిమి తోం,
ఉల్లాసమే ... ఓ వెల్లువలా, ఓ ఉప్పెనలా,

ఉరకాలిర ఆ జోరుకి, తకదిమి తోం,
పరిగెడదాం, పరిగెడదాం, గెలిచే వరకు పరిగెడదాం
గురి చూసాక, మనకింక తిరుగేది ... 

|| గాయేంగె || ||  తకదిమి తోం ||
 

చరణం - 3:
నీ మాటతో ...  అటు నిశబ్దం, ఇటు ఓ యుద్ధం,
ఆగాలిరా ఆ నేర్పుకి, తకదిమి తోం,
నీ ప్రేమతో ...  ఆ శత్రువునే, ఓ మిత్రునిగా,

మార్చాలిరా ఆ గెలుపుకి, తకదిమి తోం
ఒకటౌదాం, ఒకటౌదాం, ప్రేమను పంచగ ఒకటౌదాం,
ప్రేమించే .. మనసుంటే .. మహరాజే
 
|| గాయేంగె || ||  తకదిమి తోం ||
కష్టం - నష్టం యెదురైనా, నచ్చినదదే చేసేద్దాం,
అలవాటైనా, చేదైనా, తకదిమి తోం
కృషి వుంటే నీ వెంటేరా ఈ లోకం || గాయేంగె ||

Nannaku Prematho Title Song - Jr. NTR Songs - 2016

Movie :  నాన్నకు ప్రేమతో (2016)
Lyrics : దేవి శ్రీ ప్రసాద్ 
Music , Singer : దేవి శ్రీ ప్రసాద్ 

 
పల్లవి:
ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన
ఆనందం అనే ఉయ్యాలలో, నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం


చరణం - 1:
నేనేదారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా,
నీ వెంట నేనున్నానని, నను నడిపించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం


చరణం - 2: 
ఏ తప్పు నే చేసినా, తప్పటడుగులే వేసినా,
ఓ చిన్ని చిరునవ్వుతోనే, నను మన్నించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

చరణం - 3: 
ఏ ఊసు నే చెప్పిన, ఏ పాట నే పాడినా,
భలే ఉంది మళ్ళీ పాడరా, అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం


చరణం - 4:
 
ఈ అందమైన, రంగుల లోకాన,
ఒకే జన్మలో, వంద జన్మలకు ప్రేమందించిన,
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
ఈ పాటతో.. ఈ పాటతో..


Dandalayya Undallayya - Telugu Song Lyrics - Venkatesh Songs - 1991

Movie: Coolie No 1 (1991)

Music : Ilayaraja

Singers: S P Balasubramanyam

Lyrics:  Sirivennela Seetarama Sastry

పల్లవి : 
జై జై జై ...  జై  గణేశ ...   జై జై జై ... జై  ...
జై జై జై ... జై వినాయక ... జై జై జై ... జై ... || 2 ||

దండాల్లయ్యా, ఉండ్రాళ్ళయ్యా, దయుంచయ్యా దేవా 
నీ అండా దండా ఉండాల్లయ్యా, చూపించయ్యా త్రోవ 
పిండి వంటలారగించి, తొండమెత్తి దీవించయ్య
తండ్రి వలే ఆదరించి, తోడు నీడ అందించయ్యా  
ఓ .. ఓఓ .. ఓ .. ఓఓ.. ఓఉ ఓఉ ఓఉ ఓఉ ... ఓ .. || దండాలయ్యా || 

చరణం - 1:

చిన్నారి ఈ చిట్టెలుకెలా, భరించెరా లంబోదరా, పాపం కొండంత నీ పెను భారం,
ముచ్చెమటలు కక్కిందిరా, ముజ్జగములూ తిప్పిందిరా ...
ఓహో .. ఓ .. జన్మ ధన్యం .. 
అంబారిగా, ఉండగల ఇంతటి వరం ... అయ్యోర  అయ్యా ...
అంబాసుతా , ఎందరికి లభించురా ... అయ్యోర  అయ్యా ...
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా ... || దండాలయ్యా || 

చరణం  - 2:
శివుని శిరసు సింహాసనం,  పొందిన చంద్రుడి గోరోజనం,
నిన్నే చేసింది వేలాకోలం ... 
ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా ... ఏమైయి పోయింది గర్వం 
త్రిమూర్తులే, నిను గని తలొంచరా ... అయ్యోర  అయ్యా ... 
నిరంతరం, మహిమలు కీర్తించరా ... అయ్యోర అయ్యా ...
నువ్వెంతనే, అహం, నువ్వే దండించరా || దండాలయ్యా || 
జై జై జై జై గణేశ జై జై జై జై జై 
జై జై జై జై వినాయక  జై జై జై జై