Monday, October 8, 2018

Nuvve Na Swasa - Shreya Goshal Songs - Okariki Okaru - 2003

Movie Name : ఒకరికి ఒకరు  (2003)
Singer : శ్రేయ గోశల్
Lyrics : చంద్రబోస్ 

Music : ఎం ఎం కీరవాణి
పల్లవి :
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
చరణం - 1:
పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు
తారలలో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బులోన చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా...
నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా
నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
చరణం - 2:
సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని
ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా...ఓ ప్రియతమా...

No comments:

Post a Comment